ఎన్నికల నిబంధన ప్రకారం ఎస్ఐఆర్ పకడ్బందీగా చేపట్టండి…

ఎన్నికల నిబంధన ప్రకారం ఎస్ఐఆర్ పకడ్బందీగా చేపట్టండి…

ఊట్కూర్, ఆంధ్రప్రభః ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( ఎస్ఐఆర్ ) పకడ్బందీగా చేపట్టాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ తాసిల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. మండలంలో ఎన్నికల ప్రాజెనీ మ్యాపింగ్ తహసీల్దార్ చింత రవి ,బూత్ లెవెల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మండలంలో ప్రగతిని పరిశీలన చేశారు. మండలం యొక్క ప్రోగ్రెస్ తనిఖీ చేస్తూ ఎలెక్షన్ కమిషన్ నిబంధనల మేరకు మ్యాపింగ్ చేయాలని, పెండింగ్ ఉన్న పోలింగ్ కేంద్రాల్లో త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం త్వరగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ , ఇందిరమ్మ ఇళ్ల పూర్తి చేయాలని ఎంపిడిఓ కిషోర్ కుమార్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply