నిరుపేద కుటుంబానికి మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ చేయూత..

నిరుపేద కుటుంబానికి మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ చేయూత..

రూ.18000,క్వింటా బియ్యం అందజేత

మోత్కూర్, ఆంధ్రప్రభః మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో ని అన్నెపువాడ లో నిరుపేద కుటుంబానికి చెందిన కొంతం సుజాత అనారోగ్యంతో మృతి చెందగా, మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ ఆర్ధిక సహాయం అందించి అండగా నిలిచారు.ఈ సందర్భంగా మృతురాలి కుమారుడు అంజి కి మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న ల చేతుల మీదుగా రూ.18 వేల చెక్కు , క్వింటా బియ్యం అందించారు.

ఏడాది క్రితం సుజాత భర్త యాదయ్య సైతం అనారోగ్యం తో చనిపోగా వాట్సాప్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందించారు.వీరికి ఇద్దరు బిడ్డలు , ఒక కుమారుడు ఉన్నారు. కొడుకు కొనతం అంజి (20) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఆర్ధిక ఇబ్బందులతో మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ ని ఆశ్రయించగా,తక్షణమే స్పందించిన సభ్యులు ఆర్ధిక సహాయం అందించి ఆ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో వాట్సప్ గ్రూప్ ప్రతినిధులు ధబ్బేటి సోంబాబు, కౌన్సిలర్లు కారుపోతుల వెంకన్న ,మెంట రమణ నగేష్, గనగాని శైలజ నర్సయ్య, మార్కెట్ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి,ప్రతినిధులు మొరిగాల శ్రీను,ఎం డి షాకీర్,బొల్లెపల్లి శ్రావణ్,ప్రకాష్ రెడ్డి, చాపల అంజయ్య,బోయిని వెంకట్,రాజయ్య,రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply