భూసారం కాపాడుకోవాలి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నల్లబెల్లి, ఆంధ్రప్రభ ; రసాయన ఎరువులను తగిన మోతాదులోనే వాడాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రైతులకు సూచించారు. నల్లబెల్లి మండలం కొండాయిలపల్లి గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంగా ఏర్పాటు చేసిన మిర్చి రైతుల అవగాహన సదస్సులో కలెక్టర్ సత్య శారదతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,ఎరువుల వాడకం తగ్గించాలని,లేకపోతే భూసారం దెబ్బతింటుందని,పంటలు పండే పరిస్థితి రాదని హెచ్చరించారు. మిర్చి కోత తర్వాత మార్కెట్‌కు తీసుకెళ్లేటప్పుడు తేమ లేకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు.

అదే సమయంలో ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఎరువులు, మిర్చి గింజలు, ఉద్యానవన పంటలకు 50% వరకు సబ్సిడీ, PM కిసాన్ పథకం ద్వారా ఆర్థిక సహాయం వంటివి సద్వాడని సూచించారు. ఈ పథకాలను పూర్తిగా అందుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి,మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్ రావు,సర్పంచ్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply