ExamTensions |ఈ జాగ్రత్తలు మీకోసమే..

ExamTensions |ఈ జాగ్రత్తలు మీకోసమే..

ExamTensions | చదువును మూడు లేదా నాలుగు విడతల్లో విభజించుకోవాలి.
రోజుకు 14 నుంచి 18 గంటలు చదవాల్సిన అవసరం లేదు
రోజుకు 8 నుంచి 9 గంటలు పద్ధతిగా చదువుకుంటే సరిపోతుంది.
ప్రతి గంట లేదా గంటన్నరకు 10 నిమిషాలు విరామం తీసుకోవాలి.
ఆ సమయంలో నీళ్లు తాగడం, కాసేపు నడవడం, దూరం చూడడం మంచిది.
మొబైల్ లేదా టీవీ చూడటం మాత్రం విశ్రాంతి కాదు.
జ్ఞాపకశక్తికి నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోతే ప్రశ్నలను అర్థం చేసుకునే వేగం తగ్గిపోతుంది.
రోజుకు 6 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి.
వీలైతే మధ్యాహ్నం 20 నుంచి 30 నిమిషాలు కునుకు తీయడం మెదడుకు ఉత్తేజాన్ని ఇస్తుంది.
పరీక్షల సమయంలోనూ వ్యాయామం అవసరం.
రోజుకు కనీసం 30 నుంచి 60 నిమిషాలు నడక, పరుగు లేదా ఏదైనా ఆట ఆడితే శరీరం, మనసు చురుకుగా ఉంటాయి.
స్నేహితులతో కలిసి ఆడటం వల్ల ఉల్లాసం పెరుగుతుంది.
పరీక్షల సమయంలో జంక్ ఫుడ్, అధిక చక్కెరను తగ్గించాలి.
మితంగా, సమయానికి ఆహారం తీసుకోవాలి. అధికంగా తింటే మత్తుగా ఉంటుంది.
అరటి, యాపిల్, జామ, బొప్పాయి వంటి పండ్లు, బాదం, పిస్తా, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్ మెదడుకు శక్తినిస్తాయి.
గుడ్లు, పాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. టీ, కాఫీ పరిమితంగా తీసుకోవాలి.
ఎనర్జీ డ్రింక్స్ వంటి పానీయాలు ఆందోళనను పెంచుతాయి.
ExamTensions | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండటం చాలా ముఖ్యం. మంచి మార్కులు వస్తాయో రావోననే ఆందోళన ఎక్కువైతే చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. అందుకని పరీక్షల వేళ కంగారు పడకుండా ఉండాల్సిన అవసరం ఉంది. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలపై అధిక ఒత్తిడి చేయకూడదు. మార్కుల కంటే వారి ఆరోగ్యం, మానసిక స్థితి ముఖ్యమని గుర్తించాలి.


