వైకుంఠ రథం వితరణ..

మంథని టౌన్, ఆంధ్రప్రభ : గుంజపడుగు గ్రామ సర్పంచ్ సంధ్య బానేష్ గ్రామంలో వైకుంఠ రథం సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని శ్రీ సీతారామ సేవా సదన్ వారికి విన్నవించారు. శనివారం శ్రీ సీతారామ సేవా సదన్ వారు గట్టు నారాయణ గూరుజి ఆశీస్సులతో వైకుంఠ రథం మంథని మండలం గుంజపడుగు గ్రామ సర్పంచ్ సంధ్య బానేష్ కు అందజేశారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం వైకుంఠరతం అందజేసిన శ్రీ సీతారామ సేవా సదన్ అధ్యక్షుడు కేవీఎల్ఎన్ హరిబాబు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply