Grade-2 | విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు…

Grade-2 | విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు…
- మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
Grade-2 | టంగుటూరు, ఆంధ్రప్రభ : విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు వారధులుగా నిలవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న 8 మందికి గ్రేడ్-1 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గా పదోన్నతి లభించింది. వారికి పదోన్నతి ఉత్తర్వులను శనివారం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ పదోన్నతి అంటే కేవలం హోదా పెరగడం కాదు, బాధ్యత పెరగడం. సాంఘిక సంక్షేమ శాఖకు మీ పనితీరు ద్వారా మంచి పేరు తీసుకురావాలి. హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు మీరే తల్లిదండ్రులు. వారి చదువు, ఆరోగ్యం, మెనూ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు. “పేదరికం కారణంగా హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లలు రేపటి సమాజానికి ఆదర్శంగా నిలవాలి. వారి వ్యక్తిత్వ వికాసం కోసం మీరు నిరంతరం కృషి చేయాలన్నారు.
పదోన్నతి పొందిన వారి వివరాలు
బాలికల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు:
డి.దుర్గాలక్ష్మి (ఒంగోలు), కె.శ్రీలత (ఒంగోలు), కె. స్వప్నలత (ఒంగోలు), ఎన్.అరుణ కుమారి (కొత్తపట్నం),
బాలుర హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు:
సి.హెచ్. శ్రీనివాసులు (గుడ్లూరు), ఎన్ .ప్రభుదాస్ బి. (బి నిడమానూరు). జె. సుమన్ శాస్త్రి (కేవీ పల్లిఎం. హరిబాబు(పొదిలి). ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మా నాయక్ కందుకూరు లింగయ్య, ప్రకాశం జిల్లా హెచ్.డబ్ల్యూ.ఓ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ డి. అంకబాబు, ఆఫీస్ సూపర్డెంట్ మాల్యాద్రి, సీనియర్ అసిస్టెంట్ మాలకొండయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
