24 carrets| నెమ్మదించిన పసిడి పరుగు

24 carrets| నెమ్మదించిన పసిడి పరుగు
- ఈ రోజు పెరిగింది తక్కువే..
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,650
- కిలో వెండి ధర రూ. 2,70,100

24 carrets| ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఏ రోజు తగ్గుతాయో తెలియడం లేదు. పసిడి ధరల్లో వస్తున్న భారీ హెచ్చుతగ్గులతో కొనుగోలుదారులు కన్ప్యూజన్ అవుతున్నారు. ఇవాళ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు ఫిబ్రవరి 20న (శుక్రవారం), 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 10 పెరిగి, 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,650 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం: రూ.1,43,600, 18 క్యారెట్ల బంగారం: రూ.1,17,520 ధర ఉంది. హైదరాబాద్: భాగ్యనగరంలో పసిడి ధర రూ.1,56,500 గా నమోదైంది.

వెండి ధర ఇలా..
వెండి ధరల పరిస్థితి బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో ఈ వారం కొంత ఒడిదుడుకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేడు దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ. 2,70,100 వద్ద ఉంది. పారిశ్రామిక రంగం నుంచి వస్తున్న డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ సంకేతాల ఆధారంగా వెండి ధరలు మారుతుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.

