హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ ( BJP )తెలంగాణ రాష్ట్ర శాఖకు నూతన అధ్యక్షుడిగా ఎన్. రామచందర్రావు (N ramachandra rao ) శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనను గజమాలతో ఘనంగా సత్కరించారు (Felicitated ) .ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి (Kishan reddy ) , ఎంపీ డీకే అరుణ (DK Aruna ) , ఇతర సీనియర్ బీజేపీ నేతలు హాజరయ్యారు.
ముందుగా తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరిన రామచందర్రావు ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వతీ దేవాలయంలో, అనంతరం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు. రామచందర్రావు నాయకత్వంలో తెలంగాణ బీజేపీ మరింత బలోపేతం కానుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.