Congress | ఇచ్చిన హామీలన్నీ అమలుకు సిద్ధం..

Congress | ఇచ్చిన హామీలన్నీ అమలుకు సిద్ధం..
Congress, ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ మండల యువజన నాయకులు సయ్యద్ సాబీర్ అన్నారు.
ఈ సందర్భంగా సాబీర్ మాట్లాడుతూ.. నాడు ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ, స్వర్గీయ సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలోనే నిరుపేద లబ్ధిదారులకు ఇండ్లను విరివిరిగా మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అదే దిశగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి హయాంలో పేదలకు ఇండ్లను నిర్మిస్తున్నారని ఇది ప్రజాపాలన ప్రభుత్వంలోని ఘనతే అన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ 10 ఏండ్లలో బొందల గడ్డలు, స్మశాన వాటికలు, ఏజెన్సీ అడవుల్లో హరితహారం మొక్కలు నాటడం విచారకరం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గొప్ప విజయాన్ని అందించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల విజయాలు సైతం ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ పట్టం కట్టిన ప్రజలకు అభినందనీయమన్నారు.
అదే క్రమంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, రేపో మాపో రైతు భరోసాను రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధంగా చేస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందిస్తున్న ఘనత కేవలం తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీయే అందిస్తుందని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ప్రారంభించిన వంతెన బ్రిడ్జిలు కల్వర్టులు మధ్యనే అర్ధాంతరంగా నిలిచిపోవడంతో పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అట్టి పనులకు సంపూర్ణంగా అటవీశాఖ అధికార్ల అనుమతులతో ముందుకు సాగుతున్నారని కొనియాడారు.
మండల వ్యాప్తంగా ప్రజల సమస్యలన్నీ అసెంబ్లీ వేదిక సాక్షిగా ప్రస్తావించడం జరిగిందని గుర్తు చేశారు. రానున్న కాలంలో మండలంలోని నిరుపేద లబ్ధిదార్లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు, నిలిచిపోయిన వంతెనలు శరవేగంగా నిర్మాణాలకు కృషి చేయడం, మండల కేంద్రంలో కాలేజీ, కోఆపరేట్ భవననిర్మాణం, మండల సముదాయాల భవనాలు, రాయిగూడెం వంతెన కరకగూడెం గుట్ట పై రహదారి నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికలు, మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో నెలకొన్న సుదీర్ఘమైన పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను శరవేగంగా అందించేందుకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కంకణం కట్టుకున్నారని, వారి సేవలు అమోఘమని షేక్ సాబీర్ కొనియాడారు.
