విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి..

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి..

భోజన పరిసరాలు శుభ్రంగా ఉంచాలి
-జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి పద్మ

బాల్కొండ, ఆంధ్రప్రభః ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తూ,పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ఇంచార్జి జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి,మండల మండల ప్రత్యేక అధికారిణి పద్మ సూచించారు.గురువారం బాల్కొండ మండల కేంద్రంలో గల మహాత్మా జ్యోతి బాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో ఆమె అక్కడ నెలకొన్న పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భోజనాలు చేసే ప్రాంతం అపరిశుభ్రంగా ఉండడంతో కుక్ తీరుపై మండిపడ్డారు.మళ్లీ వచ్చేలోగా శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.కస్తూర్భాగాంధీ పాఠశాలలో కల్పించే వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేజీబీవీలో విద్యార్థులకు స్వయంగా ఆమె వడ్డించి విద్యార్థులతో కలిసి ఆమె భోజనం చేశారు.

పీఎం శ్రీ పథకం కింద చేపడుతున్న అదనపు తరగతుల పనులను త్వరతగతిన పూర్తి చేయాలి

బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నతర పాఠశాల ఆవరణలో రూ. 36 లక్షల రూపాయలతో పిఎంశ్రీ కింద చేపడుతున్న అదనపు తరగతి, ల్యాబ్,గదుల నిర్మాణం త్వరత గతిన పూర్తి చేయాలని ఆమె మండల విద్యాధికారిని ఆదేశించారు. నిధులు ఉన్న పనులు ఎందుకు సకాలంలో పూర్తికాలేవని ఆమె ఒకానొక సందర్భంలో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.అసంపూర్తి పనులపై మండల విద్యాధికారి రాజేశ్వర్ ను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్ పనుల నిర్వహణ కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

కిసాన్ నగర్ లో భవిత సెంటర్ పరిశీలన

బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ లో గల భవిత సెంటర్ ను జిల్లా సంక్షేమ అధికారిణి పద్మ గురువారం పరిశీలించారు.సెంటర్ లో చేపట్టే ఫిజియోథెరఫీ కి ఎక్కువ సంఖ్యలో వచ్చే పిల్లల కోసం చుట్టూ ఫెన్సింగ్ వేసి, గ్రీనరీ ఏర్పాటు చేయాలన్నారు.ఆమె వెంట తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్,ఎంపీవో గంగా మోహన్, సూపరిండెంట్ రమణ, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఏఈ వెంకటేశం, కేజీబీవీ పాఠశాల ప్రత్యేక అధికారిణి భవాని,మహాత్మ జ్యోతిబాపూలే ఇంచార్జి ప్రిన్సిపాల్ రాణి ఆయా పాఠశాలల సిబ్బంది అధ్యాపక బృందం తదితరులు ఉన్నారు.

Leave a Reply