February 21 | కౌన్సిల్ ఎజెండా పై చర్చ

February 21 | కౌన్సిల్ ఎజెండా పై చర్చ
- నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి సమీక్ష
February 21 | విజయవాడ, ఆంధ్రప్రభ : ఫిబ్రవరి 21, న జరిగే కౌన్సిల్ ఎజెండా పై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో గురువారం ఉదయం శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిల్ ఎజెండా, అడిషనల్ ఎజెండా ఉన్న ప్రతిపాదనలను శాఖధిపతులతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనలను అధికారులు అందరూ సహకరించాలని, ప్రజల కోసం విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని అన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ (జనరల్) ఎ. రవీంద్రరావు, సెక్రటరీ ఇంచార్జి కె. ప్రభుదాస్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ i/c పి. సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి సృజన, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, సూపరిండెంటింగ్ ఇంజనీర్ వి. చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జి. శ్రీనివాస్, సామ్రాజ్యం, ప్రభాకర్, సురేఖ, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ చక్రవర్తి, అకౌంట్స్ ఆఫీసర్ బి. సత్యనారాయణమూర్తి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, గోపాల నాయక్, బయాలజిస్ట్ కామేశ్వరరావు , వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
