ఉపాధి హామీ పనుల పరిశీలన..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్‌ పల్లి మండలం చౌటు పల్లి లోని పల్లే చెరువు గుట్ట వద్ద సి సి టి పనులను ఎంపిడివో చింత రాజ శ్రీనివాస్ గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డులు ఉన్న ప్రతి కూలీలందరికీ పనులు కల్పించే విధంగా పనులను నిర్వహిస్తున్నామని తెలిపారు.పని ప్రదేశంలో ప్రతి కూలి సమయం వృధా చేయకుండా పనులు నిర్వహించాలని, నిర్వహించిన పనులకు కొలతల ప్రకారం డబ్బులు చెల్లించడం జరుగుతుందని పనిచేస్తున్న కూలీలకు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శివ, ఫీల్డ్ అసిస్టెంట్ షేక్. సాధుల్ల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply