Cpm | మర్రి సుజాతకు నివాళుర్పించిన సీపీఎం నేతలు

Cpm | మర్రి సుజాతకు నివాళుర్పించిన సీపీఎం నేతలు

మర్రి సుజాత మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న సిపిఎం నేత జహంగీర్
సిపిఎం మహిళా నాయకురాలు మర్రి సుజాత ఆకస్మిక మృతి, పలువురు సంతాపం
మర్రి సుజాత ఆశయాలను సాధిస్తాం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాహంగీర్

Cpm | చౌటుప్పల్,ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని మసీదు గూడెం గ్రామానికి చెందిన సిపిఐఎం మండల నాయకురాలు మర్రి సుజాత ఆకస్మికంగా మరణించడం పార్టీకి తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి జహంగీర్ తెలిపారు. మసీదుగూడెం గ్రామంలోని ఆమె నివాసానికి బుధవారం జహంగీర్ తోపాటు పలువురు స్థానిక సిపిఎం నాయకులు వెళ్లి ఆమె మృతదేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం జరిగిన అంత్యక్రియలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేసిన సుజాతక్క ఆశయాల సాధన కోసం కృషి చేస్తామన్నారు.


మండలంలో సిపిఐఎం పార్టీ బలోపేతం కోసం కందాల రంగారెడ్డి నాయకత్వంలో మాజీ ఎంపీపీ మర్రి రామ్ రెడ్డి తో పాటు ఆయన సతీమణి మర్రి సుజాత లు నిరంతరం కృషి చేశారన్నారు. మహిళల హక్కుల కోసం, మహిళల సమస్యల పరిష్కారం కోసం గ్రామ గ్రామాన మహిళా సంఘాలు ఏర్పాటు చేసి అనేక రకమైన పోరాటాలు చేసిన చరిత్ర సుజాతక్కదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బొంతల చంద్రారెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, జి శ్రీనివాస్ చారి, ఎండి పాషా, గంగాదేవి సైదులు, గోశిక కరుణాకర్, అవ్వారి రామేశ్వరి, రాగిరి కిష్టయ్య, కోట రామచంద్రారెడ్డి, గడ్డం వెంకటేష్, సురకంటి శ్రీనివాస్ రెడ్డి, బండారు నరసింహ, గోషిక స్వామి, తుమ్మల నర్సిరెడ్డి, అవారి గోవర్ధన్, బత్తుల దాసు, కొండే శ్రీశైలం, యాట బాలరాజు, బొడ్డు అంజిరెడ్డి ఎలక రాజు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply