Congress | మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో మంత్రి శ్రీహరి భేటీ

Congress | మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో మంత్రి శ్రీహరి భేటీ
రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ను కలిగిన మంత్రి వాకిటి శ్రీహరి
రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేలతో మంత్రి వాకిటి శ్రీహరి
Congress | మక్తల్, ఆంధ్రప్రభః తెలంగాణలో జరిగిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 శాతం సీట్లలో విజయం సాదించిన సందర్భంగా డిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే లను రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి కలుసుకున్నారు. తెలంగాణలో మొత్తం మున్సిపాలిటీలు 116 లో కాంగ్రెస్ 87 చోట్ల ,మొత్తం కార్పొరేషన్లు 7లో కాంగ్రెస్ 5 చోట్ల విజయం సాదించినట్లు మంత్రి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లకు వివరించారు.
తెలంగాణ మొత్తంలో 90 శాతం విజయం సాధించడం పట్ల వారు అభినందించారు. మరిత ఉత్సాహంగా పనిచేయాలని, ప్రజా సంక్షేమానికి పాటుపడాలని వారు సూచించినట్లు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి తెలిపారు.
