Addanki | నాంచారమ్మ తల్లి గ్రామోత్సవం ప్రారంభం..

Addanki | నాంచారమ్మ తల్లి గ్రామోత్సవం ప్రారంభం..
Addanki, కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండల పరిధిలోని కృష్ణా నది తీరాన వేం చేసియున్న శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లి గ్రామోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ అర్చకులు ఘంటసాల జై పార్థసారథి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారు గ్రామోత్సవానికి బయలుదేరి వెళ్లారు. భారీగా బాణాసంచా కాలుస్తూ అమ్మవారి గ్రామోత్సవం ప్రారంభమైంది. ఆలయ కమిటీ చైర్మన్ తోట సూర్య నరసింహారావు, సభ్యులు తోట సోమశేఖరరావుతో పాటు పాలకమండలి సభ్యులు విశ్వనాధపల్లి, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
