Road accident | చెరుకు బండిని ఢీ కొట్టిన కంటైనర్..

Road accident | చెరుకు బండిని ఢీ కొట్టిన కంటైనర్..
Road accident, సదాశివనగర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రం సమీపంలోని 44వ జాతీయ రహాదారి పై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు ఎడ్లు మృతిచెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సదాశివనగర్ గ్రామ శివారు నుండి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలిస్తున్న రెండు ఎడ్ల బండ్లను నిజామాబాద్ వైపు నుండి వస్తున్న కంటైనర్ అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.2,10000 విలువ గల రెండు ఎడ్లు మృతి చెందగా, బన్నీ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
