డిగ్రీ కళాశాల ప్రచార పోస్టర్ ఆవిష్కరణ

డిగ్రీ కళాశాల ప్రచార పోస్టర్ ఆవిష్కరణ
- డిగ్రీ కళాశాల చదివే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి,
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం, మండలం బెజ్జోర గ్రామంలో బుధవారం పర్యటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల”ప్రగతి పాలన-ప్రజా ప్రణాళిక”కార్యక్రమంలో భాగంగా, కళాశాల అధ్యాపకులు బెజ్జోరా గ్రామ సర్పంచ్ మేస కార్తిక్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తో కలిసి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు చేరికలను పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన “గోడ పత్రిక (పోస్టర్స్) కరపత్రాలను” విడుదల చేశారు.అలాగే లింగాపూర్ గ్రామ సర్పంచ్ మర్యాదపురం కలిసి వారిచే కళాశాల ప్రచార పోస్టర్ లను విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచులు మాట్లాడుతూ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్య అనుభవం గల లెక్చలర్లతో విద్యాబోధన అందించడంలో ముందుకు వస్తున్నారు. విద్యార్థిని విద్యార్థులు డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు తీసుకొని ఉన్నంత చదువు చదివి నీ లక్ష్యం సాధించాలని కొనిఆడారు.ఈ కార్యక్రమంలో కళాశాల కో- ఆర్డినేటర్ శ్రీనివాస్, కళాశాల లెక్చలర్,గ్రామ పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
