Birthday | ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

Birthday | ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

Birthday | పరకాల,ఆంధ్రప్రభ: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కెసిఆర్) జన్మదిన వేడుకలను మంగళవారం రోజు పరకాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలి వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు మాట్లడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కెసిఆర్ పాత్రను స్మరించుకుంటూ, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని నాయకులు కొనియాడారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తీసుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత కెసిఆర్ అని కొనియాడారు. రైతు, విద్యార్థి, మహిళ, నిరుద్యోగ యువత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన దూరదృష్టి గల నాయకుడిగా అభివర్ణించారు.


ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పడిదెల దీప్తి రాకేష్ రావు, రేగూరి కరుణ విజయపాల్ రెడ్డి, దుబాసి వెంకటస్వామి, బొచ్చు శ్యామల బాబురావు, మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు అభిమానులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply