NTR l అసలు ప్లాన్ ఇదే..

NTR l అసలు ప్లాన్ ఇదే..
NTR l 500 కోట్ల కలెక్షన్స్ తర్వాత దేవర 2పై స్పష్టత
కథలో భారీ మార్పులు… నార్త్ ఆడియన్స్ టార్గెట్
కొరటాల – త్రివిక్రమ్ మధ్య ఎన్టీఆర్ ఎవరివైపు?
నవంబర్ నుంచి దేవర 2 షూటింగ్?
జనవరిలో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : దేవర.. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. ప్లాప్ టాక్ వచ్చినా.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీ రిలీజ్ కంటే ముందే దేవర 2 అనౌన్స్ చేశారు. ఆతర్వాత దేవర 2 ఉంటుందా..? ఉండదా..? అనేది పెద్ద చర్చే జరిగింది. ఎట్టకేలకు దేవర 2 ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. అయితే.. ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మరి.. దేవర 2 పట్టాలెక్కేది ఎప్పుడు..? త్రివిక్రమ్ తో సినిమా సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు…?
NTR | మార్పులు చేర్పులు..

దేవర సినిమా కోసం కొరటాల కథ పై చాన్నాళ్లు కసరత్తు చేశాడు. ఎన్టీఆర్ ను పవర్ ఫుల్ గా చూపించాలని విభిన్నంగా ఉండే కథను రెడీ చేసి మెప్పించాడు. అయితే.. దేవర సినిమా కథ పై కొన్ని విమర్శలు రావడంతో.. ఈసారి దేవర 2 కథను అంతకు మించి అనేలా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడట కొరటాల. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కి నచ్చేలా కథలో కీలక మార్పులు చేర్పులు చేశాడని తెలిసింది. ఈ మార్పులు చేర్పులు ఎన్టీఆర్ కి నచ్చడంతో దేవర 2 చేయడానికి ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
NTR | కొరటాల తర్వాతే త్రివిక్రమ్..

అయితే.. ఎన్టీఆర్ కోసం.. ఓ వైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వెయిట్ చేస్తున్నాడు. మరో వైపు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల వెయిట్ చేస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న డ్రాగన్ మూవీ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు..? త్రివిక్రమ్ తో చేస్తాడా..? కొరటాలతో చేస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది. త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో కార్తికేయుని కథతో భారీ మైథలాజికల్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. మరో వైపు కొరటాల కూడా దేవర 2 పట్టాలెక్కించేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. నవంబర్ నుంచి దేవర 2 స్టార్ట్ చేస్తారని.. ఎన్టీఆర్ లేని సీన్స్ తో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇక త్రివిక్రమ్ తో సినిమాని జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకురానున్నారని టాక్. మరి.. ఈ రెండు సినిమాల గురించి త్వరలో అఫీషియల్ గా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
