ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కమలాపూర్, ఆంధ్రప్రభ ; హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో ఈరోజు జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలతో పాటు హైస్కూల్లో పర్యటించి ఆయా పాఠశాలల పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఐదో తరగతి క్లాస్ రూమ్ లో సుమారు అరగంటకు పైగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి విద్యార్థుల విద్యాపరమైన స్థితిగతులు తెలుసుకున్నారు. అంతేకాకుండా కలెక్టర్ విద్యార్థులకు బోధన కూడా అందించారు. కలెక్టర్ వెంట జిల్లా అధికారులతో పాటు స్థానిక ఎంపీడీవో గుండె బాబు తదితరులు ఉన్నారు.
