తొర్రూరు చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థుల ఎన్నిక

తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ 2వ వార్డు అభ్యర్థి తూనం శ్రావణ్ కుమార్, వైస్ చైర్మన్ గా 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సోమ రజిని రాజశేఖర్ లు ఎన్నికయ్యారు. తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో టిఆర్ఎస్ 9 సీట్లు కాంగ్రెస్ ఏడు సీట్లు గెలిచింది. అయితే ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కూడిన ఎక్స్ అఫీషియో నెంబర్తో కాంగ్రెస్ బలం 9కి చేరింది. దీంతో ఎన్నికల అధికారుల సమక్షంలో డ్రా తీయగా చైర్మన్, వైస్ చైర్మన్ లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికయ్యారు.
