ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72 వ జన్మదిన వేడుకలు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అవుసలోనిపల్లిలో మంగళవారంఘనంగా నిర్వహించారు. బి ఆర్ ఎస్ నాయకులు అభిమానులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణిచేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఎల్లమ్మ తిమ్మయ్య మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి జరిగిందన్నారు. కెసిఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలనిఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, పెద్ద బాలప్ప, తిమ్మయ్య,రాందేశాయ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి,మల్లప్ప, నాగేష్,యువకులు శ్రీనివాస్, ప్రకాష్, లక్ష్మణ్, వెంకటేష్, వెంకటేశ్వర్ రెడ్డి, లడ్డు,రాము, పోలురాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply