Candidates |మున్సిపల్ చైర్మన్ గా బుర్ర కొమురయ్య

Candidates | మున్సిపల్ చైర్మన్ గా బుర్ర కొమురయ్య
Candidates | ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : జయశంకర్ జిల్లా భూపాలపల్లి చైర్మన్ గా బుర్ర కొమురయ్య ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. భూపాలపల్లి 30వ వార్డుల్లో కాంగ్రెస్ 16 స్థానాల్లో గెలుపొందగా, సిపిఐ -01, కాంగ్రెస్ రెబల్- 01 గెలుపొందగా, బిఆర్ఎస్ -10, బిజెపి -2 అభ్యర్థులు గెలిచారు. సోమవారం మున్సిపాలిటీ సమావేశ మందిరంలో డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి హరికిషన్ గెలిచిన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా 2వ వార్డు కౌన్సిలర్ బుర్ర కొమురయ్య ను అప్పం కిషన్ ప్రతిపాదించగా కురిమిల్ల శ్రీనివాస్ బలపరిచారు. వైస్ చైర్మన్ గా 15వ వార్డు కౌన్సిలర్ అంబాల శ్రీనివాస్ ను బొడ్డు అశోక్ ప్రతిపాదించగా, రాజు నాయక్ బలపరుచగా కోరం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
