Minister | ప‌ర‌మ‌శివుని అనుగ్ర‌హం ఉండాలి…

Minister | ప‌ర‌మ‌శివుని అనుగ్ర‌హం ఉండాలి…

Minister | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీకాకుళం నగరంలో నాగావళి నది తీరాన వెలసిన పురాతన దేవాలయం శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామి వారిని ఆదివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అభిషేకం చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. పరమశివుని అనుగ్రహం సమస్త మానవాళిపై ఉండాలని వారు కోరారు. ఆలయ చైర్మన్, ఆలయ ఈవో, స్థానిక కూటమి నాయకులు, తదితరులు వారితో పాల్గొన్నారు.

Minister |

Leave a Reply