Budget | సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా….

Budget | సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా….

Budget | విజయవాడ ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 2026–27 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం. పేదల సంక్షేమం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, విద్యా అభివృద్ధి మౌలిక సదుపాయాల విస్తరణ లక్ష్యాలుగా రూపొందిన ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించి, సమతుల్య దృక్పథంతో కేటాయింపులు చేయబడిన తీరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం, పరిపాలనా దక్షతను స్పష్టంగా ప్రతిబింబిస్తోందని, సంక్షేమం అభివృద్ధి అనే రెండు చక్రాలపై రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. రైతులకు ఆర్థిక భరోసా, విద్యార్థులకు ప్రోత్సాహం, మహిళలకు ఆర్థిక సాయం, గ్రామీణ, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందన్నారు.

రాజధాని అభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల విస్తరణకు అవసరమైన నిధుల కేటాయింపు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందన్నారు. మొత్తం మీద ఈ బడ్జెట్ ప్రజారంజకమైనదిగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నదని, ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు.

Leave a Reply