Krishna District | బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా పాలేపోగు లక్ష్మీ..

Krishna District | బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా పాలేపోగు లక్ష్మీ..

Krishna District, పెడన, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలిగా పాలేపోగు లక్ష్మీ మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. పెడన నియోజకవర్గం గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన లక్ష్మీ గత కొన్నేళ్లుగా ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి మధుకర్, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు తాతినేని శ్రీ రామ్, ప్రధాన కార్యదర్శులు లక్ష్మి ప్రసన్న, మట్టా ప్రసాద్, కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమార స్వామిక రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజు, జిల్లా మాజీ అధ్యక్షులు గుత్తికొండ రాజాబాబులకి లక్ష్మీ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply