- రూ 2.65 కోట్ల నగదు కానుకలు…
- భారీగా బంగారం వెండి కానుకల సమర్పణ…
విజయవాడ, (ఆంధ్రప్రభ) : నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మకు పెద్ద ఎత్తున భక్తులు కానుకులను సమర్పించుకున్నారు. గడిచిన 15 రోజుల ఆలయంలోని హుండీలను బుధవారం ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరవ అంతస్తులు దేవాదాయ శాఖ కమిషనర్, ఈఓ రామచంద్ర మోహన్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపును నిర్వహించారు.
భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీ లెక్కింపు సందర్బంగా 15రోజులకు గానూ రూ.02,65,88,961/-(రెండు కోట్ల, అరవై ఐదు లక్షల, ఎనబై ఎనిమిది వేల, తొమ్మిది వందల అరవై ఒక రూపాయలు) నగదు రూపంలో, 500గ్రాముల బంగారం, 4 కేజిల 358గ్రాముల వెండి రూపంలో లభించాయి.
ఆలయ కార్యనిర్వహణాధికారి కె.రామచంద్ర మోహన్, ఉప కార్యనిర్వహణాధికారి ఎం.రత్నరాజు హుండీల లెక్కింపు కార్యక్రమం పర్యవేక్షించారు. దేవదాయ శాఖసిబ్బంది,వన్ టౌన్ పోలీసులు, ఎస్.పి.ఎఫ్ పోలీసులు హుండీల కార్యక్రమం లో పాల్గొన్నారు.