Chennur | మున్సిపల్ పీఠం ఎవరిని వరించేనో ?

Chennur | మున్సిపల్ పీఠం ఎవరిని వరించేనో ?
మంత్రి ఆశీస్సులు ఎవరికో..?
Chennur, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ పీఠం ఎవరిని వరించేనో అని ప్రజలు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొంత మంది బడా నాయకులు అధికార పీఠం దక్కించుకునేదుకు మంత్రి వివేక్ అనుచరులతో లాభియింగ్ చేస్తున్నట్లు సమాచారం. 18 వార్డులున్నచెన్నూరు మున్సిపాల్టీలో అధికారం దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికల షెడ్యూల్ వెలువడినుంచి నుంచి టికెట్ల పంపిణీ, ఎన్నికల ప్రచారాలు ఓటర్లను ప్రలోభాల వరకు పోటాపోటీగా తలపడ్డాయి. ఎన్నికల చివరి అంకం పూర్తి అయ్యేసరికి అధికార కాంగ్రెస్ పార్టీ ఇతరుల సహాయం లేకుండా అధికార పీఠం కైవసం చేసుకునేందుకు మెజార్టీ 11 వార్డు స్థానాలు కైవసం చేసుకొని మంత్రి వివేక్ సమక్షంలో రేపు (సోమవారం) నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టనున్నాయి.
ఈ తరుణంలో కీలక ఛైర్ పర్సన్ పగ్గాలు మంత్రి వివేక్ ఎవరి చేతికి అందివ్వానున్నారో అని అధికార పార్టీ నాయకులలో ఉతకంఠ మొదలైంది. ఛైర్ పర్సన్ బీసీ మహిళా రిజర్వుడు కావడంతో అన్ని పార్టీల అభ్యర్థుల నాయకులు సీటు పై కన్నేసి తమ తమ సతీమణులను రంగంలోకి దింపి లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన కొంతమందికి నిరాశే మిగిలింది.
చివరికి మంత్రి వివేక్ ప్రతిష్టగా భావించి తన అభ్యర్థుల గెలుపు కొరకు బూత్ లెవల్ వర్క్ చేసి తన అభ్యర్థులను గెలిపించుకున్నారు. గెలిచిన అభ్యర్థులలో నాల్గురు బీసీ మహిళలు ఉన్నప్పటికీ ఛైర్ పర్సన్ పదవి పోటీకి 2వ వార్డు నుంచి పెద్దింటి పద్మ శ్రీనివాస్, 9 వార్డునుంచి సద్దుపల్లి సునీతా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మంత్రి ఆశీర్వాదం ఎవరి పైన ఉంటుందో, పదవి ఎవరిని వరించేనో అని పట్టణ ప్రజలు చర్చిచుకుంటున్నారు.
