Serial Crash : అయ్యో.. శవరాత్రి Andhra Prabha Spot News
Serial Crash : అయ్యో.. శవరాత్రి Andhra Prabha Spot News
7గురు అక్కడికక్కడే దుర్మరణం
6గురు చిత్తూరు ఫ్యామిలీ
ఇద్దరు చిన్నారులు.. ఓ మహిళశివరాత్రికి వస్తున్న ఫ్యామిలీ
( ఆంధప్రభ. బెంగళూరు)
Serial Crash : అయ్యో.. శవరాత్రి Andhra Prabha Spot Newsబెంగళూరు శివార్లలోని హోస్కోట్ సమీపంలో జరిగిన వరుస ప్రమాదాల్లో (Serial Crash) ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇందులో ఆరుగురు ఒకే కుటుంబ సభ్యులు ఉన్నారు. ఐదేళ్ల చిన్నారి, 11 నెలల పసికందు కూడా మృతి చెందారు. ఈ కుటుంబం చిత్తూరు జిల్లాకు చెందగా.. మహా శివరాత్రికి సొంతూరుకు వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. హోస్కోట్ పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ,

బెంగళూరు .. -చెన్నై జాతీయ రహదారిపై గోట్టిపుర గేట్ (Gottipura Gate) సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల ప్రాంతంలో.అధిక వేగంతో వెళ్తున్న XUV కారు, ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో వాహనం కూడా వీటిని ఢీకొనడంతో సీరియల్ క్రాష్ గా (Serial Crash) మారింది.డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబం కారులో బయలుదేరింది. ఈ ప్రమాదంలో బెంగుళూరులో నివసిస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన కేశవ రెడ్డి (44), బీటెక్ విద్యార్థిని తులసి (21), చిన్నారి. – ప్రణతి (5) – 11 నెలల – పసికందు యాత్విక్ ను గుర్తించారు.

మిగిలిన ముగ్గురి సమాచారం తెలియలేదు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హోస్కోట్లోని సిలికాన్ సిటీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హోస్కోట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హోస్కోట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ALSO READ : DHOOM 6 : జస్ట్ 6 నిముషాల్లో దోపిడీ
