Farmers | యూరియా కోసం పెట్టిన యాప్ రద్దు చేయాలి..

Farmers | యూరియా కోసం పెట్టిన యాప్ రద్దు చేయాలి..
- తాడికల్లో రోడ్డెక్కిన రైతన్నలు,
Farmers | శంకరపట్నం, ఆంధ్రప్రభ : తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానాన్ని రైతులకు యూరియా కోసం ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ , యాప్ ను రద్దు చేయాలని కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం ,మండలం తాడికల్ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. గురువారం తాడికల్ గ్రామంలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసి తాడికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చేరుకొని ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను దేశానికి వెన్నెముకగా దేశ పాలకులు రాష్ట్ర పాలకులు మీడియా ముందు, దినపత్రికల ముందు ప్రకటన చేయడమే తప్ప రైతు శ్రేయస్సు కోసం ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టకుండా రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిపంటలు సాగు చేసి యూరియా అంధక వేసిన పంటలు నష్టపోయే విధంగా రైతులను అధోగతి పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో యూరియా అందించక చేసిన అప్పులు తీరేది ఎలా అని బోరునా విలపించారు. దేశంలో ఎక్కడ లని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వము యూరియా కోసము రూపొందించిన నూతన విధానాన్ని, యాప్ ను వెంటనే రద్దుచేసి, రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలతో యూరియా పంపిణీ చేసి వేసిన పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు నిర్లక్ష్యం చేస్తే రైతులందరం ఏకమై ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
