above studies | విదేశీ విద్యపై భారతీయులకు అనాసక్తి

above studies | ఆంధ్రప్రభ,వెబ్ డెస్క్: పై చదువుల కో్సం అబ్రాడ్ వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సహయ మంత్రి సుకాంత మజుమ్ దార్ వారికి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 2023లో ఉన్నత విద్య కోసం 9.08 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్లారన్నారు. 2024లో విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య 7.7 లక్షలకు తగ్గింది. 2025లో గణనీయంగా తగ్గి.. 6.26 లక్షలకు చేరింది. దీంతో విదేశాల్లో చదువుకునే వారి సంఖ్య రెండేళ్లలో 31 శాతానికి పడిపోయిందని మంత్రి వెల్లడించారు.

భారత్‌లో కుడా నాణ్యమైన విద్యను అందించేందుకు జాతీయ విద్యావిధానం (NEP)-2020 కింద ప్రభుత్వం విద్యార్థులకు సహయ సహకారాలు అందిస్తున్నామని వివరించారు. విదేశీ యూనివర్సిటీలను భారత్ లో ఏర్పాటు చేసుకునేలా ఆస్తకి కలిగిన వారికి అనుమతులు ఇస్తున్నమన్నారు. దాదాపు 14 విదేశీ విద్యాసంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ప్రవాసీయులు భారత్‌కు ఒక ఆస్తి. వారి సామర్థ్యాన్ని వినియోగించుకునేలా ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మంత్రి మజుమ్ దార్ వెల్లడించారు.
