Clearance | టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

Clearance | టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
- పార్టీ శ్రేణులకూ, కార్యకర్తలకూ గద్దె అనురాధ హృదయపూర్వక కృతజ్ఞతలు
Clearance | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం (ఎన్టీఆర్ జిల్లా) పరిధిలో బుధవారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులందరికీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన ప్రతి కార్యకర్త పాత్ర అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.
జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా నగరం లోని ఆటోనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయాన్ని గద్దె అనురాధ సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయానికి రోజూ వచ్చే నాయకులు, కార్యకర్తలతో పరిచయం చేసుకుని, పార్టీ కార్యకలాపాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ప్రతి కార్యకర్తతో నేరుగా అనుసంధానం కావడం అత్యంత అవసరమని ఆమె అన్నారు.

ఈ నెలలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో, సంబంధిత స్థలంలో జరుగుతున్న గ్రౌండ్ క్లియరెన్స్ పనులను ఆమె పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడి, నిర్మాణం వేగవంతంగా, నాణ్యత ప్రమాణాలతో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా మారి, జిల్లావ్యాప్తంగా పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేస్తుందని గద్దె అనురాధ స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులంతా సమిష్టిగా పనిచేసి ప్రజల సమస్యలపై పోరాటం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచి, జిల్లాలో తెలుగుదేశం పార్టీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆమె వెల్లడించారు.
