Release of funds | మరోసారి రూ.387 కోట్ల నిధులు విడుదల!

Release of funds | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద తాజా విడతగా రూ.387 కోట్లను మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం లభించనుంది. కేంద్రం విడతలవారీగా నిధులను విడుదల చేస్తోంది.

Release of funds

మొదటి విడత : రూ. 259.36 కోట్లు విడుదల చేయగా, తాజాగా రూ. 387.00 కోట్లు విడుదల చేసింది. మొత్తం విడుదలైన నిధులు: రూ. 646.36 కోట్లు. 15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు రావాల్సిన మొత్తం నిధుల్లో ఇప్పటికీ సుమారు రూ. 2,400 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి మొత్తం రూ.3,000 కోట్లకు పైగా నిధులు అందాల్సి ఉండగా, కేంద్రం నిబంధనల ప్రకారం దశలవారీగా వీటిని కేటాయిస్తోంది.

Leave a Reply