Cardiography | బలగ ఆసుపత్రిలో గుండె జబ్బుల నిర్ధారణ శిబిరం

Cardiography | బలగ ఆసుపత్రిలో గుండె జబ్బుల నిర్ధారణ శిబిరం
Cardiography | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల పాలిట జిల్లా బాలల ఆరోగ్య సంరక్షణ కేంద్రం అభయమిచ్చింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె. అనిత ఆదేశాల మేరకు బలగలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బుధవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆర్.బి.యస్.కె. ప్రోగ్రాం అధికారి శివరంజని, పీడియాట్రిక్ విభాగం అధిపతి పి.రాము ఈ శిబిర పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు.
Cardiography | ఉచితంగా గుండె పరీక్షలు..
ఈ శిబిరంలో విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రికి చెందిన పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అశోక్ రాజు చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్యాధునిక పరికరాలతో ఉచితంగా 2డి ఎకో, కార్డియోగ్రఫీ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుండె సమస్యలు తీవ్రంగా ఉన్న చిన్నారులను గుర్తించి, వారికి మెడికవర్ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఈ ఆపరేషన్లు పూర్తిగా ఉచితంగా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.
Cardiography | రేపు టెక్కలిలో శిబిరం…

జిల్లా వ్యాప్తంగా ఉన్న బాధితుల సౌకర్యార్థం.. ఈ నెల 13న టెక్కలి జిల్లా ఆసుపత్రిలోని డీఈఐసీ కేంద్రంలో మరో వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో పీడియాట్రీషియన్ నూక చైతన్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
