Bhimaram | టెండర్లకు బహిరంగ వేలం..

Bhimaram | భీమారం, ఆంధ్రప్రభ : శ్రీ శ్రీ శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా టెండర్ల కు ఈనెల 13 శుక్రవారం 11:30గంటలకు దేవాలయ ప్రాంగణంలో బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎన్. వెంకట్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొబ్బరికాయలు పూజ సామాగ్రి ధారావత్తు 60 వేలు చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని, అదేవిధంగా కొబ్బరి ముక్కలు ప్రోగు చేసుకోవడానికి 20 వేలు, లడ్డు, పులిహోర ప్రసాదం విక్రయించడానికి 60 వేలు రంగులరాట్నం కు 50 వేలు చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని తెలిపారు.
