Meeting | ఆ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించిన సీఎం..

Meeting | ఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజ‌ధాని ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. కేంద్ర‌ ర‌క్ష‌ణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలో నిర్వ‌హించే గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని కేంద్ర మంత్రిని సీఎం ఆహ్వానించారు.

Meeting

ఈసా… మూసీ న‌దుల సంగ‌మ స్థ‌లంలో కార్య‌క్ర‌మం చేప‌డుతున్న‌ట్లు సీఎం ర‌క్ష‌ణ మంత్రికి వివ‌రించారు. 1948 ఫిబ్ర‌వ‌రిలో మ‌హాత్ముని చిత‌భ‌స్మాన్ని ఈసా… మూసీ సంగ‌మ స్థ‌లిలో నిమ‌జ్జ‌నం చేశార‌ని కేంద్ర మంత్రికి తెలిపారు. మూసీ పున‌రుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు చేప‌డుతున్న‌ట్లు సీఎం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివ‌రించారు. బాపూఘాట్‌ను ప్ర‌పంచ స్థాయి విద్యా, సాంస్కృతిక‌, ఆధ్యాత్మిక‌, ప‌ర్యావ‌ర‌ణ చిహ్నంగా నిల‌ప‌నున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలియ‌జేశారు.

Leave a Reply