Brahmotsavams | శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ..

Brahmotsavams | శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ..

నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

Brahmotsavams | అచ్చంపేట, ఆంధ్రప్రభ: ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు ఆలయ కమిటీ చైర్మన్ వేముల నరసింహారావు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో వేద పండితుల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, విద్యుత్, భోజనం, శౌచాలయాలు, పారిశుధ్యం తదితర అన్ని మౌలిక సదుపాయాలు సమర్థవంతంగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆలయ పరిసరాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, వేగవంతంగా పూర్తి చేయాలని ఆలయ కమిటీకి సూచించారు. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నర్సింలు, మండల అధ్యక్షులు, మండల ప్రజాప్రతినిధులు, మామిళ్లపల్లి గ్రామ సర్పంచ్ మొకురాల మోహన్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, డిప్యూటీ సర్పంచులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply