Orders | మార్చి 17 లోపు నివేదిక ఇవ్వాలి

Orders | మార్చి 17 లోపు నివేదిక ఇవ్వాలి
Orders | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గ్రూప్-1పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 మూల్యాంకనం అక్రమాలపై సిట్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏడీజీ స్థాయి అధికారితో సిట్ విచారణ జరపాలన్న హైకోర్టు.. మార్చి 17 లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
రాష్ట్రం వెలుపల ఉన్న ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకోవాలని, ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా, వాటిని ఎవరైనా ట్యాంపర్ చేశారా అనే విషయాలను పరిశీలించాలని న్యాయస్థానం సూచించింది. మార్చి 16లోగా నివేదిక సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి అనుబంధ పిటిషన్లను పరిష్కరించిన హైకోర్టు.. ప్రధాన వ్యాజ్యాలపై విచారణను వాయిదా వేసింది.
