Kannapur | గ్రామ రైతుల వినూత‌న‌ నిరసన…

Kannapur | గ్రామ రైతుల వినూత‌న‌ నిరసన…

  • యూరియా యాప్ ను రద్దు చేయాలి…
  • పంటలు నష్టపోతున్నాం..

Kannapur | శంకరపట్నం, ఆంధ్రప్రభ : దేశానికి అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నుము కానీ దేశంలోని పాలకులు మీడియా ముందు ప్రకటనలే చేస్తున్నారు. రైతులకు పంటలకు కావలసిన యూరియా కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన యాప్ ను రద్దు చేయాలని కన్నాపూర్ గ్రామ రైతులు వినూత‌నంగా నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గo ,శంకరపట్నం మండలం, కన్నాపూర్ గ్రామ రైతులు గ్రామంలోని గోదాం ఎదుట సెల్ ఫోన్ లను కుప్పలుగా పోసి, రోడ్డుపై పడుకుని విన్నత నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వము దేశంలో ఎక్కడలేని విధంగా నూతనంగా రైతులకు పంటలకు కావలసిన యూరియా విక్రయం కోసం యాప్ , సాఫ్ట్వేర్ ను పొందుపరిచి, రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకొని యూరియా కొనుగోలు చేయాలని నూతన విధానాన్ని ప్రవేశపెట్టడంతో పంటలకు సకాలంలో యూరియా అందించక పంటలు పూర్తిగా నష్టపోతున్నామని, యాప్ ద్వారా రైతులకు యూరియా అందకుండా పోతుందని, స్మార్ట్ ఫోన్లు వినియోగించే రైతులు చాలా తక్కువగా ఉన్నారని, యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయలేకపోవడంతో, వేసిన పంటలు చేతికందే పరిస్థితి లేదని, ఇప్పటికైనా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వము పాలకులు అధికారులు స్పందించి యాప్ ను రద్దుచేసి, పట్టాదార్ పాస్ పుస్తకం ద్వారా రైతులకు కావాల్సిన యూరియాను దిగుమతి చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ను నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజుల్లో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కన్నాపూర్, ధర్మారం, అర్కండ్ల, గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

Leave a Reply