Raipole | కారు – బైక్ డీ …

Raipole | కారు – బైక్ డీ …

  • ఒకరికి తీవ్ర గాయాలు

Raipole | రాయపోల్, ఆంధ్ర‌ప్ర‌భ : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో ఎదురెదురుగా వస్తున్న కారు – బైక్ ఢీకొన్న ఘటనలో బైక్ పైన ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. రాయపోల్ మండలం టెంకంపేట్ గ్రామానికి చెందిన దర్శనం బాబు (40). పని నిమిత్తం రాయపోల్ నుండి టెంకంపేట్ గ్రామానికి వెళ్తున్న క్రమంలో రాయపోల్ హై స్కూల్ మూలమలుపు వద్ద ఎదురెదురుగా కారు బైక్ ఢీ కొన్నాయి. వెంటనే అక్కడి స్థానికులు 108 అంబులెన్స్ కి సమాచారం ఇవ్వగా దౌల్తాబాద్ 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ భాను ప్రకాష్, పైలట్ నర్సింలు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితునికి ప్రథమ చికిత్స అందించి స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ గజ్వేల్ కి తరలించారు.

Leave a Reply