TG | సేవకుల గా మారిన పోలీసు అధికారులు

TG | సేవకుల గా మారిన పోలీసు అధికారులు
వృద్ధ ఓటర్లకు సహాయం
TG | గోదావరిఖని, ఆంధ్రప్రభ : నిత్యం ఖాకి దుస్తులు సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినంగా ఉండే పోలీసు అధికారులు మున్సిపల్ ఎన్నికల వేళ మానవీయత చాటుకున్నారు. బుధవారం పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ బాలుర హై స్కూల్, గురుకుల హై స్కూల్ మంథనిలోని పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాల్లను వీల్ చేర్ల సహాయంతో పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లి ఓటు వేయించారు పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ లు. వృద్దురాల్లని ఆప్యాయంగా పలకరించి ఓటు వేసావా, పోలింగ్ కేంద్రలోకి వెళ్ళడానికి పోలీస్ వారు సహాయం చేశారా, ఆరోగ్య పరిస్థితి బాగుందా అని మానవత్వంతో అడిగి తెలుసుకొన్నారు. పోలీసులు ఎప్పుడూ ప్రజలకు సహాయంగా ఉంటారని, ప్రజలందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
