Election | 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్

Election | 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
– ప్రశాంత పోలింగ్ కోసం పోలీస్ కవాతు
– ఎన్నికల కోడ్ అమలుపై కఠిన పర్యవేక్షణ
– ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని పిలుపు
- స్టేషన్ ఘన్ పూర్ ఏసీపీ భీం శర్మ
Election | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : రానున్న 11వ తేదీన జరగనున్న స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ ఎన్ని కలను పూర్తిగా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ విస్తృత భద్రతా చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుది ట్టంగా అమలయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఐ జి.వేణు ఆధ్వర్యంలో సోమవారం మున్సిపాలిటీ పరిధిలో సీఐలు, ఎస్ఐలు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పోలీస్ కవాతును నిర్వహించారు. ఈ కవాతులో స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలు పాల్గొని ప్రజల్లో భద్రతాభావాన్ని మరింత పెంపొందిం చారు. ఈ కార్యక్రమానికి స్టేషన్ ఘన్‌పూర్ ఏసీపీ భీం శర్మ హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే సమస్యాత్మక ప్రాంతా ల్లో నిరంతర నిఘా కొనసాగుతుందని, అక్రమ మద్యం, డబ్బు పంపిణీ, బెదిరింపులు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని చెప్పారు. ప్రజలు ఎలాంటి భయాం దోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం పోలీస్ కవాతుతో మున్సిపాలిటీ పరిధిలో శాంతిభద్రతలపై నమ్మకం పెరిగింద ని స్థానికులు తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఉన్నత అధికారులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో సీఐలు జి. వేణు, శ్రీనివాస్ రెడ్డి, ఎస్ ఐ లు వినయ్ కుమార్, నరేష్, నవీన్ కుమార్, పోలీస్ సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.
