17వ వార్డు ప్రచారంలో ఎంపీ గడ్డం వంశీ..

17వ వార్డు ప్రచారంలో ఎంపీ గడ్డం వంశీ..

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రగిరి లావణ్యకు మద్దతుగా ఎంపీ గడ్డం వంశీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలోని 17వ వార్డు అభ్యర్థి చంద్రగిరి లావణ్య చేతి గుర్తు పై ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను వందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, ఇది యువతకు మంచి అవకాశాలు కల్పించే గొప్ప అవకాశం అని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సింగరేణి సంస్థకు సంబంధించిన అంశాల పై కీలక నిర్ణయాలు తీసుకున్నామని, గత ఆరు నెలల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల అప్పుల విషయంలో కొంత స్థిరత్వం సాధించామని అన్నారు.

గత ప్రభుత్వ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక వాస్తవాలు బయటకు వచ్చాయని, ఈ ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు చేసింది అనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు. మన ప్రాంతానికి సంబంధించి అమృత్ భారత్ స్కీమ్ ద్వారా దాదాపు వంద కోట్ల రూపాయలతో, నీటి సమస్య పరిష్కారం పై చర్యలుతీసుకుంటున్నామని, గతంలో స్పష్టత లేకపోయినా, ఇప్పుడు పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. గత పది సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ పార్టీ ఇసుక దందాలు, భూముల దోపిడీ, అక్రమ సంపాదనలకే పరిమితమైందని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నిధులు దోచుకున్న చరిత్ర లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభిమానులు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply