ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేస్తా..

జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నన్ను ఆశీర్వదించి గెలిపించండి వాడు అభివృద్ధి సమస్యల పరిష్కారం చేస్తానని కాంగ్రెస్ పార్టీ 28వ వార్డు అభ్యర్థి రహత్ బేగం అన్నారు ఆదివారం వార్డులో ఇంటింటా ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బానుక శివరాజ్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన కొనసాగిస్తుందని అన్నారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డు అభివృద్ధి మరింత చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రహత బేగం ను అత్యధిక మెజార్టీతో ఆశీర్వదించి గెలిపించాలని అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
