7వ వార్డు అభివృద్ధి కోసం నవీద్ పాషాను గెలిపించండి

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా 7వ వార్డు నుండి పోటీ చేస్తున్న చిట్యాల నవీద్ పాషాను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్ రెడ్డి పిలుపునిచ్చారు.నవీద్ పాషా కు మద్దతుగా ఆదివారం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి అయ్యప్ప కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, రెహమానియా కాలనీ, మారుతి నగర్ ప్రాంతాలలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లను కలుసుకుని బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు .ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. 7వ వార్డు అభివృద్ధి కోసం ఒక విజన్ తో మీ ముందు నిలిచిన నవీద్ పాషా ను ఆదరించి గెలిపించాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీ అమలు చేయలేదన్నారు .ఉచిత బస్ తప్పా మరే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు .మున్సిపల్ ఎన్నికల్లోను ప్రజలను మోసగించడం తప్ప అభివృద్ధి చేయడం కాంగ్రెస్ పార్టీకి చేతకాదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా అభివృద్ధి చేయడం చేతకాదని వారి ఆస్తులు మాత్రం పెంచుకోవడం మాత్రం పక్క అవుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులను నమ్మి మరోసారి మోసపోవద్దని ఆయన మక్తల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
యువకుడైన చిట్యాల నవీద్ పాషా ఏడవ వార్డు పరిధిలోని అయ్యప్ప కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, రెహమానియా కాలనీ సుగురేశ్వర కాలనీ ,వెంకటరమణ కాలనీ ,మారుతి నగర్ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి అని అన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి అతడి వద్ద ఒక విజన్ ఉందని గుర్తు చేశారు .ఆ విజన్ తో ఏడవ వార్డును ఆదర్శప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తారని చెప్పారు. అందుకే ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి 7వ వార్డు కౌన్సిలర్ గా నవీద్ పాషాను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ రెడ్డి విజ్ఞప్తి చేశారు .అదేవిధంగా మిగతా వార్డుల్లోనూ బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇంచార్జ్ బాలరాజ్ యాదవ్, మాజీ మార్కెట్ చైర్మన్ పి. నరసింహ గౌడ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా, రాజుల ఆశిరెడ్డి,చిట్యాల జుబేర్ పాషా, ఉప్పరి అశోక్ సాగర్ ,అన్వర్ హుస్సేన్, మనన్ , అస్గర్ అలీ తదితరులు.
