కర్రెం చెన్నమ్మ గెలుపు అభివృద్ధికి మలుపు

ఓటరు మద్దతు కోరుతున్న 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కర్రెం చెన్నమ్మ నీలప్ప
మక్తల్ , ఫిబ్రవరి 6 ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్రెం చెన్నమ్మ నీలప్ప గెలుపు అభివృద్ధికి మలుపు అని తెలంగాణ ఉద్యమకారులు జి.నీలప్ప, డి. దత్తాత్రేయ అన్నారు .ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు .గడపగడపకు వెళ్లి అధికార పార్టీ అభ్యర్థి కర్రెం చెన్నమ్మ నీలప్పకు మద్దతుగ కోరారు. అండగా నిలిచి ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు.
మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో పదవ వార్డులో పూర్తిస్థాయి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుదాం అన్నారు. కౌన్సిలర్‌గా కర్రెం చెన్నమ్మ నీలప్ప గెలిచినప్పటికీ ఈ వార్డులోని ప్రతి ఒక్కరూ కౌన్సిలర్ గా భావించాలన్నారు .అందరి కోసం పనిచేయడమే కౌన్సిలర్ బాధ్యతగా పనిచేస్తారని చెప్పారు. వార్డు పరిధిలో సిసి రోడ్లు మురుగు కాలువల నిర్మాణం చేపట్టేందుకు ప్రాధాన్యం
