నర్సంపేట మున్సిపాలిటీలో ముమ్మ‌ర ప్ర‌చారం…

నర్సంపేట రూరల్, ఆంధ్ర‌ప్ర‌భ : నర్సంపేట మండలం 11వ వార్డు అభ్యర్థి చీకటి స్వరూప ఓదయ్య గౌడ్ నేడు గ్రామంలో జరిపిన ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా స్వరూప ఓదయ్య గౌడ్‌ గ్రామ ప్రజలు ఆదరణ పొందుతున్నారు. ఈ ప్రచారంలో గ్రామ పార్టీ అధ్యక్షులు వరంగంటి కుమారస్వామి, కోల మధులత, మాజీ సర్పంచ్ ఆకులపల్లి మల్లేశం, మాజీ ఎంపిటిసి హర్షణ పెళ్లి వెంకటేశ్వరరావు. మాజీ వార్డు సభ్యులు వెలదండి భారతి మధు, పల్లగొండ రమేష్, రాయపూరి మల్లికాంబ, కోల సావిత్రి, గన్నోజు రవీంద్రాచారి కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మకట్టయ్య, కొమ్మ చంద్రమౌళి, చల్ల శ్రీనివాసరెడ్డి, బండారి సతీష్, కుండలింగస్వామి, అల్లి అశోక్, కొల రవికుమార్, ఆకులపల్లి భాస్కర్, అనమకొండ మహేష్, ఆకులపల్లి తరుణ్‌లు చీకటి స్వరూప ఓదయ్య గౌడ్‌ను సమర్థించారు. ఈ నాయకులు గ్రామ ప్రజలతో మాట్లాడుతూ, స్వరూప ఓదయ్య గౌడ్ ఎన్నికైతే గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతాయని చెప్పారు. ఈ ప్రచారం ద్వారా 11వ వార్డు ప్రజలలో స్వరూప ఓదయ్య గౌడ్‌పై మరింత ఆదరణ పెరిగినట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో గ్రాము ప్రజల అభివృద్ధికి తమను అంకితం చేసుకుంటానని అభ్యర్థి స్వరూప ఓదయ్య గౌడ్ తెలిపారు.

Leave a Reply