కోత్రేపల్లిలో ప్రచార నిర్వహించిన బక్క అర్చన యాదగిరి..

కోత్రేపల్లిలో ప్రచార నిర్వహించిన బక్క అర్చన యాదగిరి..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 5 వ వార్డు రుద్రేపల్లిలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని అభ్యర్థి బక అర్చన యాదగిరి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆమె ప్రచార నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటుందని పేర్కొన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్తె మున్సిపల్ చైర్పర్సన్ గా రంగంలో ఉండడంతో భారీ ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉందని.. ఈ విషయాన్ని గమనించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి హస్తం గుర్తును గెలిపించాలని ఆమెకు కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు బక్క యాదగిరి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply