Aleru l బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం..

Aleru l బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం..
Aleru, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి యాట శివ తరపున శుక్రవారం ఇంటింటి ప్రచారం ముమ్మరంగా జరిగింది. మహిళలు, పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని శివను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. మాజీ కౌన్సిలర్ బైక్ రాములు, మాజీ ఎంపీపీ కాసగళ్ళ అనసూయ, సీనియర్ మహిళా నాయకురాలు యాట ఉమారాణి పాల్గొన్నారు.
