ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా

24 వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి శిరీష రమేష్ గౌడ్

వనపర్తి ప్రతినిధి : ఫిబ్రవరి 5 ( ఆంధ్రప్రభ): వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆదరించి కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించాలని శిరీష రమేష్ గౌడ్ ఓటర్లను కోరారు. వనపర్తిని అభివృద్ధి పథంలో నిలిపిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహాయ సహకారాలతో వార్డులో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వార్డులోని పలు కాలనీలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పెద్ద ఎత్తున కాలనీవాసులు ఓటర్లు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాట్లాడుతూ 24వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు మద్యానికి డబ్బు ప్రలోభాలకు లోను కాకుండా అభివృద్ధి కోసం పనిచేస్తున్న టిఆర్ఎస్ పార్టీకి అండ దండగా నిలిచి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. వార్డుకు కావలసిన పనులను గుర్తించి అభివృద్ధి చేస్తామన్నారు. 24 వార్డ్ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మన వార్డును అభివృద్ధి పథకంలో ఉంచుతామన్నారు.

Leave a Reply